కామారెడ్డి, 2026-09-11
11 సెప్టెంబరు 2026 న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నిర్వహించనున్న జాతీయ పోషణ మాసం కార్యక్రమాలలో మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా | 11.09.2026 జిల్లా వ్యాప్తంగా జాతీయ పోషణ మాసం కార్యక్రమాలు “మన అంగన్వాడీ మనందరి బాధ్యత” నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ నుంచి వ తేదీ వరకు 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా జాతీయ పోషణ మాసం కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. “మన అంగన్వాడీ – మనందరి బాధ్యత” అనే నినాదంతో అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి తెలిపారు. సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోషణ మాసంలో భాగంగా వైవిధ్యమైన పోషకాహారం, అంగన్వాడీ కేంద్రాల్లో తాజాగా వండి అందించే వేడి భోజనం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ స్థాయిని మెరుగుపరిచే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అదేవిధంగా పిల్లల సమగ్ర అభివృద్ధికి పోషకాహారంతో పాటు ప్రాథమిక ప్రేరణాత్మక కార్యకలాపాలు, ప్రధానమంత్రి మాతృ వందన యోజనపై అవగాహన, పోషణ మేళాలు, మెనూ బోర్డుల ప్రదర్శన, పోషణ సమావేశాలు, అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ కమిటీల సమావేశాలు, గృహ సందర్శనల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పోషణ కార్యక్రమాల్లో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రసన్న పేర్కొన్నారు.











