ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 8 వేల అడుగులు నడవడం మంచిదే అయినప్పటికీ, పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) ముప్పును పూర్తిగా నివారించడానికి ఇది మాత్రమే సరిపోదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నడకతో పాటు ఇతర జీవనశైలి మార్పులు కూడా అత్యవసరం అని వారు సూచిస్తున్నారు.
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ నడవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజుకు 8 వేల అడుగులు నడవడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండటంతో పాటు గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. అయితే ప్రతిరోజూ 8 వేల అడుగులు నడవడం వల్ల పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) ముప్పు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, పక్షవాతం నివారణకు అదొక్కటే సరిపోదని చెబుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
పక్షవాతానికి ప్రధాన కారణాల్లో అధిక రక్తపోటు ఒకటి. అధిక రక్తపోటు ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు దెబ్బతినతాయి. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవచ్చు. కొన్నిసార్లు మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ, వైద్యుల సూచనల ప్రకారం నియంత్రణలో ఉంచుకోవాలి.












