కామారెడ్డి, జూలై 21
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులను ప్రజలు సులభంగా నమోదు చేసుకునేందుకు జిల్లా కోర్టు ప్రాంగణంలో తాత్కాలిక కామన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని మంగళవారం ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ శ్రీమతి పి. ముక్తిద ప్రారంభించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులను ప్రజలు సులభంగా నమోదు చేసుకునేలా జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కామన్ సర్వీస్ సెంటర్ (ఎక్స్టెన్షన్ సెంటర్)ను మంగళవారం ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ శ్రీమతి పి. ముక్తిద ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్ఐఆర్ దరఖాస్తుల నమోదు విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పత్రికా కథనాల ద్వారా తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కోర్టు ప్రాంగణంలోనే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ తరఫున జిల్లా కలెక్టర్‌ను కోరగా, వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో కేంద్రాన్ని ఏర్పాటు చేయించినందుకు జిల్లా పరిపాలనకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కేంద్రం ద్వారా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు, కక్షిదారులు, సాధారణ ప్రజలు ఎస్ఐఆర్ దరఖాస్తులను సులభంగా నమోదు చేసుకొని ప్రభుత్వ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.











