ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చేనేత కార్మికుల ప్రాధాన్యతను, గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఆయన వివరించారు.
సిరిసిల్ల నేతన్నల ప్రాశస్త్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. మనిషి నాగరికత వస్త్రంతో ప్రారంభమైంది. అలాంటి వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల అడ్డా. చేనేత కార్మికులకు, చేతివృత్తులకు ఇది ప్రధాన కేంద్రం అని ఆయన అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అగ్గిపెట్టెలో చీరను మడతపెట్టే నైపుణ్యం ఇక్కడి నేత కార్మికుల ప్రత్యేకత. ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు తెచ్చిన నైపుణ్యం కలిగిన చేనేత సోదరులు ఈ ప్రాంతంలో ఉన్నారు. చేనేత మగ్గాల నుండి సాంచాల వరకు వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు అని ఆయన తెలిపారు.











