తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ నిర్ణయంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధుల వినియోగం మరింత వేగవంతం కానుంది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం జీఓ () ఎంఎస్ నెం. 43ను జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) చట్టం2026 నుంచి అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇప్పటివరకు నిధుల ప్రక్రియ
గ్రామ పంచాయతీలు ఆస్తి పన్నులు, ఇతర స్థానిక ఆదాయ మార్గాల ద్వారా సమకూర్చుకున్న నిధులను ముందుగా ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో ఆలస్యం కారణంగా గ్రామాల్లో అత్యవసర అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులోకి రావడానికి సమయం పట్టేది.





