తమిళనాడులో జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొననున్నారు. మధురాంతకం, తారాపురం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన నాలుగు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు.
తమిళనాడులోని మధురాంతకం (ఎస్సీ), తారాపురం (ఎస్సీ) నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి. సీఎం విజయ్ ఈ రెండు నియోజకవర్గాల్లో చెరో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం. అయితే, ప్రచార తేదీలు, పూర్తి షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
టీవీకే అభ్యర్థులు వీరే
మధురాంతకం నియోజకవర్గం నుంచి టీవీకేకు చెందిన కె. మరగతం కుమరవేల్, తారాపురం నియోజకవర్గం నుంచి పి. సత్యభామ పోటీ చేయనున్నారని పార్టీ ప్రకటించింది. వీరిద్దరూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన అనంతరం, తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.










