కడప జిల్లా మండలం పెద్ద కారంపల్లి ఎంపీటీసీ అభ్యర్థి కమలాపురం శోభారాణి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదివారం ఉప్పరపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు.
కడప జిల్లా మండలం పెద్ద కారంపల్లి ఎంపీటీసీ అభ్యర్థి కమలాపురం శోభారాణి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదివారం ఉప్పరపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా అభ్యర్థి శోభారాణి మాట్లాడుతూ, కేకే ట్రస్ట్ ద్వారా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో పేదలకు అండగా నిలిచి, అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.











