కామారెడ్డి, ఆగస్టు 2
జిల్లాలో ట్రాఫిక్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కామారెడ్డి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
జిల్లాలో ట్రాఫిక్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కామారెడ్డి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం వల్లనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్ట్ ధరించాలని సూచించారు.
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.










