కామారెడ్డి, 2026-07-24
జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు పనులు చేపట్టారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని రద్దీ కూడళ్లలో ఒకటైన నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు పనులు చేపట్టారు. వాహనదారులకు స్పష్టమైన మార్గదర్శకత్వం కల్పించడంతో పాటు ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.
కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో కూడా ఈ బొల్లార్డ్స్ స్పష్టంగా కనిపించడం వల్ల వాహనదారులు సులభంగా మార్గాన్ని గుర్తించగలరని, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాల నివారణకు ఇవి ఎంతగానో దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాయికృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది తిరుపతి, నరేష్, చందు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.










