పోషకాహార లోపాలు, రక్తహీనత, అధిక మద్యపానం మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్యకు (సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ సీవీటీ) సంబంధించిన ప్రమాద కారకాలుగా ఉండవచ్చని బెంగళూరులోని నిమ్హాన్స్ పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా ప్రోటీన్, ఫోలేట్, విటమిన్ బి12 లోపాలు, రక్తంలో హోమోసిస్టీన్ స్థాయులు పెరగడం ఈ వ్యాధితో సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు.
పోషకాహార లోపాలు, రక్తహీనత, అధిక మద్యపానం మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్యకు (సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ సీవీటీ) సంబంధించిన ప్రమాద కారకాలుగా ఉండవచ్చని బెంగళూరులోని నిమ్హాన్స్ పరిశోధకులు వెల్లడించారు. ఈ సమస్యను సాధారణంగా సిరల సంబంధిత పక్షవాతంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ప్రోటీన్, ఫోలేట్, విటమిన్ బి12 లోపాలు, రక్తంలో హోమోసిస్టీన్ స్థాయులు పెరగడం ఈ వ్యాధితో సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్యపై పరిశోధకులు అధ్యయనం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
104 మంది రోగులు.. 109 మందితో పోలిక
నిమ్హాన్స్ న్యూరాలజీ విభాగం పరిశోధకులు 2020 నుంచి 2022 వరకు సీవీటీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన 104 మంది రోగుల వివరాలను విశ్లేషించారు. వీరితో పాటు 109 మంది ఆరోగ్యవంతులతో పోల్చి చూశారు. రోగుల రక్త పరీక్షలు, ఆరోగ్య పరిస్థితులు, ఆహారపు అలవాట్లను పరిశీలించారు. ఆహారంలో లభించే ప్రోటీన్, ఫోలేట్, విటమిన్ బి12 తదితర పోషకాల పరిమాణాన్ని సిఫార్సు చేసిన రోజువారీ అవసరాలతో పోల్చారు.
ఈ అధ్యయనంలో సీవీటీ బాధితుల్లో 63.5 శాతం మందికి హోమోసిస్టీన్ స్థాయులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 46.2 శాతం మందిలో రక్తహీనత, 45.2 శాతం మందిలో మద్యపానం అలవాటు, 37.5 శాతం మందిలో ఫోలేట్ లోపం, 26 శాతం మందిలో విటమిన్ బి12 లోపం ఉన్నట్లు వెల్లడైంది.





