బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం కింగ్ నుంచి తొలి పాట తూ మిల్ జాయే విడుదలైంది. ఈ పాటలో భారతీయ గాయకుడు అరిజిత్ సింగ్, అంతర్జాతీయ పాప్ సింగర్ ఎడ్ షీరన్ కలిసి ప్రేక్షకులను అలరించారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా కనిపించడం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తూ మిల్ జాయే పాటకు సచిన్-జిగర్ సంగీతం అందించారు. అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చి తమ గాత్రాన్ని అందించగా, ఎడ్ షీరన్ ఇందులో ఇంగ్లిష్ ర్యాప్ భాగాన్ని అందించారు. పాటకు కుమార్ సాహిత్యం అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
షారుఖ్-దీపికా రొమాంటిక్ కెమిస్ట్రీ
ఈ పాటలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంట రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించారు. కేఫ్‌లు, సముద్రతీరాలు, అందమైన ప్రదేశాల్లో వీరిద్దరూ కలిసి గడిపే క్షణాలను పాటలో చూపించారు. అయితే పాట మధ్యలో షారుఖ్ పాత్ర అక్రమ స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు చూపిస్తూ కథలోని యాక్షన్ కోణాన్ని కూడా పరిచయం చేశారు.












