రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టి కృషితో ముందుకు సాగాలని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం రాజంపేట పట్టణంలోని ఎన్.కె.ఎన్ కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకులు భీమినేని చిట్టిబాబుతో కలిసి చమర్తి జగన్ మోహన్ రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చమర్తి సూచించారు. అంతేకాకుండా, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.











