భారత యువ టెన్నిస్ క్రీడాకారిణి మాయా రాజేశ్వరన్ రేవతి అంతర్జాతీయ టెన్నిస్‌లో చరిత్ర సృష్టించింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే తన తొలి సీనియర్ ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. పోర్చుగల్‌లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ35 లాగోస్ టోర్నమెంట్ ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన సెలియా సెర్వినో రూయిజ్ను 64, 62 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.
ఈ విజయంతో మహిళల ప్రొఫెషనల్ సింగిల్స్‌లో ఈ స్థాయి టైటిల్ గెలిచిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో సానియా మీర్జా పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్వాలిఫయింగ్ నుంచి ఛాంపియన్‌గా
మాయా ఈ టోర్నమెంట్లో ప్రధాన డ్రాకు అర్హత సాధించేందుకు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడింది. అక్కడి నుంచి మొదలైన ఆమె ప్రయాణం చివరకు టైటిల్‌తో ముగిసింది. ప్రధాన డ్రాలో తొలి మ్యాచ్‌లోనే టాప్ సీడ్ జస్టినా మికుల్స్కైట్ను ఎదుర్కొంది. తొలి సెట్లో ఒక దశలో 05తో వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని 76(1), 61తో విజయం సాధించింది.











