ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనగ్రామీణ్ 2.0 కింద రాష్ట్రానికి మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి జిల్లా బుర్రిపాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ ఇళ్ల కోసం కేంద్రం తొలి విడతగా రూ.3,600 కోట్లు విడుదల చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్రానికి మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపే మరో 3 లక్షల ఇళ్లకు అనుమతులు ఇస్తామని, ఆ తర్వాత మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. దీంతో దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి మొత్తం 9 లక్షల ఇళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్రానికి తొలుత సుమారు 76 వేల ఇళ్ల కేటాయింపు మాత్రమే ఉండగా, పేద కుటుంబాలందరికీ పక్కా ఇళ్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఆ సంఖ్యను 3 లక్షలకు పెంచినట్లు చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించేందుకు కేంద్రం సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.










