రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సుండుపల్లి, మండలాలతో పాటు మద్దిలేటి పరిసర ప్రాంతాల్లోని ప్రతి గ్రామ పంచాయతీలో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలం మట్లి సమీపంలోని చందన వ్యాలీలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
రానున్న ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆకేపాటి అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
టికెట్ ఎవరికి వచ్చినా అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అందరూ దానికి కట్టుబడి ఉండాలి. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలి. పార్టీని నమ్ముకుని కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది. ఇది జగనన్న స్పష్టమైన ఆదేశం. పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరిస్తే పార్టీ అండ ఉండదు అని ఆయన స్పష్టం చేశారు.











