పుంగనూరు నియోజకవర్గంపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటిని కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
జిల్లాలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీ పదవులు పొందిన వారికి పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పుంగనూరు నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీళ్లు ఇవ్వకుండా అడ్డుకుని, సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి తరలిస్తున్నారని విమర్శించారు.











