వై.ఎస్.ఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద 500, 100 మీటర్ల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టారు. నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతూ, పరిస్థితులను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, అభ్యర్థులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.











