అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ఎవరైనా అడ్డుకుంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలుపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల ప్రక్రియలో అడ్డంకులు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు అందితే అధికారులు తక్షణమే స్పందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదుదారులను ఫోన్ ద్వారా సంప్రదించి, నిర్దేశిత గడువు సాయంత్రం 5:00 గంటలలోపు వారు నిరభ్యంతరంగా నామినేషన్ దాఖలు చేసేందుకు పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసు రక్షణతో నామినేషన్











