స్థానిక ఎన్నికల నేపథ్యంలో మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాగ మునీంద్ర నాయక్ చౌహాన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నాయకులు భూపేష్ రెడ్డి, చప్పిడి మహేష్ నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ పరిణామం వైఎస్సార్సీపీకి భారీ షాక్‌గా పరిగణించబడుతోంది. నాగ మునీంద్ర నాయక్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ, తాను గిరిజన ముద్దుబిడ్డనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైసీపీ నాయకుల తీరుతో మనస్తాపానికి గురై టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తనకు తగిన గౌరవం ఇస్తుందనే నమ్మకంతో చేరానని, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.











