కామారెడ్డి, 2026-07-22
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని DCC ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టులను అప్రజాస్వామికమని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని DCC ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.
ఈ అరెస్టులు అప్రజాస్వామికమని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నించే గొంతులను అణచివేయడం మానుకోవాలని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గంప ప్రసాద్ డిమాండ్ చేశారు.










