ఒకే కంపెనీలో దాదాపు మూడు దశాబ్దాలు పనిచేసిన తర్వాత ఉద్యోగం కోల్పోయిన అమెరికాకు చెందిన మే లీ, 59 ఏళ్ల వయసులో అంటార్కిటికాలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించారు. టెక్నాలజీ రంగం నుంచి పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
మే లీ 1987లో హెవ్లెట్-ప్యాకర్డ్ ()లో ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సంస్థలో దాదాపు 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఇంకా కొన్ని సంవత్సరాలు అదే కంపెనీలో కొనసాగాలని భావించిన సమయంలో ఆమె ఉద్యోగం కోల్పోయారు. ఉద్యోగం కోసం తనకు ఉన్న పరిచయాలు, రిఫరల్స్ ఉపయోగించుకున్నప్పటికీ వెంటనే కొత్త అవకాశం దొరకలేదు. దీంతో టెక్నాలజీ రంగానికి బయట కూడా ఉద్యోగాలను పరిశీలించాలని మాజీ సహోద్యోగి సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అంటార్కిటికా వైపు అడుగులు
మే లీ గతంలో రెండుసార్లు పర్యాటకురాలిగా అంటార్కిటికాను సందర్శించారు. ఆ ప్రాంతం ఆమెకు బాగా నచ్చింది. అక్కడ ఉద్యోగాలు కూడా ఉంటాయని తెలుసుకున్న తర్వాత పరిశోధన కేంద్రాల్లో లభించే అవకాశాల కోసం ఆమె వెతకడం ప్రారంభించారు. చివరకు అమెంటమ్ () సంస్థలో సప్లై టెక్నీషియన్‌గా ఉద్యోగం పొందారు. ఆమెకు మెక్ముర్డో స్టేషన్ ( )లో పని చేసే అవకాశం వచ్చింది.










