హుజూరాబాద్ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటలు, కాలువల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి నీటి కొరత ప్రధాన సమస్యగా మారింది. ఈ పరిస్థితిపై స్థానికులు, గణేష్ ఉత్సవ కమిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హుజూరాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాల్లోని పలు చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోగా.. మరికొన్ని చోట్ల చాలా తక్కువ స్థాయిలో మాత్రమే నీరు ఉంది. సాధారణంగా గణేష్ నిమజ్జనానికి ఉపయోగించే నీటి వనరుల్లో నీరు లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ట్యాంకర్లతో నీటి తరలింపు
గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. నిమజ్జనానికి నిర్ణయించిన ప్రాంతాలు, కాలువల్లోకి ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి నింపే ప్రక్రియను ప్రారంభించారు. అధికారులు నిమజ్జన ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.











