వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చండి గ్రామ శివారులోని విద్యుత్ ఉపకేంద్రం సమీపంలో సంగారెడ్డితూప్రాన్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలకు నీరు అందించడం కష్టమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు విద్యుత్ కోతలు, వోల్టేజీ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వరి పంట కీలక దశలో ఉన్న సమయంలో నీటి సరఫరా నిలిచిపోతే దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ కూలీల కోసం పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు విద్యుత్ సమస్యతో పంటలు దెబ్బతింటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు.











