ఉత్తరప్రదేశ్‌లో రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కిసాన్ అధికార్ యాత్రను ప్రారంభించింది. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముజఫర్‌నగర్‌లోని శుక్రతాల్ ప్రాంతం నుంచి ఈ యాత్ర మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ యాత్రలో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), చెరకు బకాయిల చెల్లింపులు, ఎరువుల కొరత, విద్యుత్ సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర వంటి కీలక అంశాలను కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం యాత్ర ప్రధాన ఉద్దేశమని పార్టీ నేతలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆరు జిల్లాల మీదుగా యాత్ర
తొలి దశలో ఈ యాత్ర పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని జిల్లాల మీదుగా సాగనుంది. ముజఫర్‌నగర్ నుంచి ప్రారంభమైన యాత్ర శామ్లీ, బాగ్పత్, మీరట్, ఘాజియాబాద్, గౌతమ్‌బుద్ధ్‌నగర్ జిల్లాల్లో కొనసాగి జేవర్లో ముగియనుంది. ఈ యాత్రలో ట్రాక్టర్ ట్రాలీలతో రైతులు పాల్గొన్నారు. మోర్నా చక్కెర కర్మాగారం వద్ద సభ నిర్వహించి, రైతుల సమస్యలపై నాయకులు మాట్లాడారు.











