మెగా డీఎస్సీ అక్రమాలకు సమాధానం చెప్పలేక, ప్రశ్నించిన వారిపై ముందుగానే మోహరించిన టీచర్ల ముసుగులోని యువగళం గుండాలతో సచివాలయ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలు, నిరుద్యోగులు, దివ్యాంగులు, డీఎస్సీ బాధితులపై పచ్చమూకల దాడులతో ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మండల పరిధిలోని దుంపలగట్టులోని రెడ్యం స్వగృహంలో మంగళవారం రెడ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్యం మాట్లాడుతూ నారా లోకేష్ గూండాలు, యువగళం రౌడీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగులపై దాడులు చేసినంత మాత్రాన, హత్యాయత్నం కేసులు అక్రమంగా బనాయించిన మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావన్న నగ్న సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించకపోతే కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. డీఎస్సీ బాధితులు, విద్యార్థి నాయకులపై టీడీపీ యువగళం గూండాలు కర్రలతో దాడి చేసిన వైనం కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, గురువులపై గూండాగిరి, డీఎస్సీ ఉపాధ్యాయులపై వైసిపి ఉన్మాదుల దాడి అంటూ ఎల్లో మీడియాలో అసత్య కథనాలు రాసి విషం చిమ్ముతూ రాష్ట్ర ప్రజలను, నిరుద్యోగులను పక్కదారి, తప్పదారి పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
టీడీపీ గుండాలు దాడులు చేసింది కాక తిరిగి వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. డీఎస్సీలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారికి సంబంధించి వారి అక్రమాలకు నగ్నంగా, సాక్షాలతో ఆధారాలు చూపిస్తుంటే, మళ్లీ సాక్షాలు చూపించాలంటూ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. తక్షణం డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని, నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.











