ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి, భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన మన తెలుగు జాతికి గర్వకారణం.
తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోసిన ఎస్పీబీ, తన పాటలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సంగీత ప్రస్థానం తరతరాలకు ఆదర్శం. నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఆయన స్మృతికి మా ఘన నివాళి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










