కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు మళ్లీ అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, తాగునీటి సమస్యలు, వ్యవసాయ రంగంలో ఇబ్బందులు కొనసాగుతున్నాయని విమర్శించారు. రైతులు సహా వివిధ వర్గాల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, కేసీఆర్‌కు మళ్లీ ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడుతోందని ఆరోపించారు. ఎన్నికలు జరిగితే గతంలో సాధించిన విజయాలను బీఆర్ఎస్ పునరావృతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.





