ప్రముఖ కెమెరా తయారీ సంస్థ కెనాన్ భారత మార్కెట్లో కొత్త ఫుల్‌ఫ్రేమ్ మిర్రర్‌లెస్ కెమెరా 8 మార్క్ ను విడుదల చేసింది. ఇది గతంలో వచ్చిన 8కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా అందుబాటులోకి వచ్చింది. కొత్త మోడల్లో ఇన్-బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్, వేగవంతమైన ఆటోఫోకస్, సెకనుకు 40 ఫ్రేమ్‌ల వరకు షూటింగ్ వంటి కీలక ఫీచర్లను తీసుకొచ్చింది.
ధర వివరాల ప్రకారం, కెనాన్ 8 మార్క్ బాడీ ధర రూ.1,78,995గా నిర్ణయించారు. ఇందులో పన్నులు కూడా కలిపి ఉన్నాయి. కెమెరాతో పాటు అదనపు ఉపకరణాలుగా ఎక్స్టెన్షన్ గ్రిప్, ట్రైపాడ్ గ్రిప్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
8 మార్క్ లో 24.2 మెగాపిక్సెల్ ఫుల్‌ఫ్రేమ్ సీఎంఓఎస్ సెన్సార్ ఉంది. దీనికి డిజిక్ ఎక్స్ ప్రాసెసర్‌ను జత చేశారు. ఫుల్‌ఫ్రేమ్ సెన్సార్ కారణంగా తక్కువ వెలుతురు పరిస్థితుల్లోనూ మంచి ఇమేజ్ క్వాలిటీ, విస్తృత ఫీల్డ్ ఆఫ్ వ్యూ పొందేలా కెమెరాను రూపొందించారు. కెమెరా బరువు బ్యాటరీ, మెమరీ కార్డుతో కలిపి సుమారు 546 గ్రాములు. కాంపాక్ట్ బాడీతో రూపొందించడం వల్ల ప్రయాణాల్లో తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉండేలా దీనిని తయారు చేశారు.











