ఒకే ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ అందరికీ వాతావరణం ఒకేలా అనిపిస్తుందా ప్రాంతాన్ని బట్టి చలి, వేడి అనుభూతిలో తేడా ఉంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు స్వీడన్‌లోని ఉప్ప్సాలా విశ్వవిద్యాలయ పరిశోధకులు వినూత్న అధ్యయనం నిర్వహించారు. ఇందులో సుమారు 6 వేల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
2025 శరదృతువు నుంచి 2026 వేసవి వరకు 10 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. స్వీడన్‌లోని దక్షిణ ప్రాంతమైన స్కేనియా నుంచి ఉత్తర ప్రాంతంలోని నార్బోటెన్ వరకు వివిధ ప్రాంతాల్లోని పెద్దలను విద్యార్థులు ఇంటర్వ్యూ చేశారు. అదే సమయంలో వారి వద్ద ఉన్న ఉష్ణోగ్రతను కూడా కొలిచి పరిశోధకులకు వివరాలను అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధ్యయనం ప్రాథమిక ఫలితాల ప్రకారం, స్వీడన్‌లోని దక్షిణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఉష్ణోగ్రతను సౌకర్యవంతంగా భావించే సందర్భాలు ఉత్తర ప్రాంతాల ప్రజలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా చాలా మంది తీవ్రమైన చలి కంటే మితమైన వేడి ఉష్ణోగ్రతలను ఇష్టపడటం ఇందుకు ఒక కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.











