బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 33 జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తాజా హెచ్చరికలు సూచిస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ, రాత్రి విశాఖపట్నంగోపాలపూర్ మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో భారీ వర్షాలతో పాటు గంటకు 5060 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
33 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు
తాజా హెచ్చరికల ప్రకారం, ఒడిశాలోని 9 జిల్లాలు (కోరాపుట్, మల్కాన్‌గిరి, రాయగడ, నవరంగ్‌పూర్, గజపతి, గంజాం, కలహండి, కంధమాల్, పూరీ), ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాలు (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం) ప్రమాదంలో ఉన్నాయి. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లోని 4 జిల్లాలు (బస్తర్, సుక్మా, దంతేవాడ, కొండగావ్), తెలంగాణలోని 6 జిల్లాలు (భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్) కూడా వరదల ముప్పును ఎదుర్కోనున్నాయి.











