కామారెడ్డి, 4 September
పోతాయిపల్లి గ్రామంలోని ఊరుకట్టపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించి కట్టను వెడల్పు , మొరం వేసే పనులు చేపట్టారు. గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే దీని లక్ష్యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోతాయిపల్లి ఊరుకట్ట విస్తరణ, మొరం పనులు చేపట్టిన కాంగ్రెస్ నాయకులు : పోతాయిపల్లి గ్రామంలోని ఊరుకట్టపై గేదెలు, ట్రాక్టర్లు మరియు ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టను వెడల్పు చేసి, మొరం వేసే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించాలనే ఉద్దేశంతో కట్టను విస్తరించి, మొరం వేయడం జరిగిందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సర్పంచ్ సావిత్రి, ఉప సర్పంచ్ సంద బాలయ్య, జీ. అల్లూరి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ పోతాయిపల్లి సీనియర్ నాయకుడు, వీడీసీ అధ్యక్షుడు అల్లూరి, తోట పోచమ్మ, శంకర్, రాములు, సైదయ్య, భూమయ్య, గొల్ల ఎషయ్య తదితరులు పాల్గొన్నారు.











