దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్తో జరుగుతున్న నిరసనలు రాజకీయంగా మరో మలుపు తిరిగాయి. ఈ ఉద్యమం కేవలం ఎన్నికల కమిషనర్ రాజీనామా కోసం మాత్రమే కాదని, ప్రభుత్వ మార్పు కోసం కూడా పోరాటం సాగుతోందని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేయడం నేరం కాదని అన్నారు. ఎన్నికలు సక్రమంగా జరగాలనే ఉద్దేశంతో ప్రస్తుతం పోరాటం చేస్తున్నామని, నిరసనకారులపై అణచివేత కొనసాగితే ప్రభుత్వ మార్పు కోసం ఉద్యమం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ మార్పు కోరుకోవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. గతంలో బీజేపీ కూడా ప్రభుత్వ మార్పు కోసం అనేక ఉద్యమాలు చేసిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వ మార్పు గురించి మాట్లాడితే కుట్రగా చిత్రీకరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిరసనలను అణచివేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు మరింత పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) నాయకురాలు నేహా బోరా, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తదితరులు పాల్గొన్నారు.











