తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని చారిత్రాత్మక పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజుగా ప్రభుత్వం పేర్కొంటోంది.
1947న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిన చారిత్రక పరిణామాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. 2024 నుంచి ఈ పేరుతో అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అమరవీరులకు నివాళులు
వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.











