చురు, 14 అక్టోబర్ 2026
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఎన్నికల్లో పోటీ చేయవద్దని అడ్డుకుంటున్నారనే కోపంతో తండ్రి తన కుమారుడు, కోడలిపై బొలెరో వాహనాన్ని నడిపి హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చురు జిల్లాలోని తారానగర్ పరిధిలో ఉన్న చంగోయి గ్రామానికి చెందిన రామ్‌చంద్ర జాట్ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలని భావించాడు. అయితే ఆయన కుమారుడు రవీంద్ర (40), కోడలు మహీంద్ర (35) ఎన్నికల్లో పోటీ చేయవద్దని సూచించారు. ఈ విషయంపై కుటుంబంలో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా ఇదే అంశంపై తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు కథనాలు వెల్లడించాయి. అనంతరం గ్రామంలోని ధర్మకాంటా వద్ద మరోసారి వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కోడలు కూడా అక్కడికి చేరుకుంది. వివాదం అనంతరం రవీంద్ర, మహీంద్ర ఇంటికి తిరిగి వెళ్తుండగా రామ్‌చంద్ర బొలెరో వాహనంతో వెనుక నుంచి వచ్చి వారిని ఢీకొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తారానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.











