రాయచోటి, జూన్ 30
రాయచోటి మార్కెట్ యార్డ్ లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ తనిఖీ జరిగింది. గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బియులు, సియూలు, వివి ప్యాట్ లతో పాటు భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు.
జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24-7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మాసవారీ తనిఖీల్లో భాగంగా, రాయచోటి పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోదామును మంగళవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ లో అంతర్భాగాలను, రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు, బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డిఓ ఏ. శ్రీనివాస్, తాసిల్దార్ యామిని, ఎలక్షన్ విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.











