స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, తమ పార్టీ తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘానికి 16 ఫిర్యాదులు అందజేసినట్లు ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో తమ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు ఇబ్బందులు కలిగించారని ఆరోపిస్తూ, పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేలా అధికారులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అప్పిరెడ్డి కోరారు. టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని, ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










