ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని, కొన్ని ప్రాంతాల్లో దాడులు, బెదిరింపులు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు.
ఎన్నికల నిర్వహణలో పోలీసుల తీరుపైనా, రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ పత్రాలను లాక్కోవడం, అభ్యర్థులను అడ్డుకోవడం, పార్టీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం వంటి ఘటనలు జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటనలకు సంబంధించిన ఆధారాలను తమ పార్టీ సంబంధిత అధికారులకు అందించిందని తెలిపారు. మహిళా అభ్యర్థులపై దాడులు జరిగాయని, కొన్ని చోట్ల నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నాయని కూడా జగన్ ఆరోపించారు.











