తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే ప్రచార చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.
తమిళ స్టార్ హీరో నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన దళపతి విజయ్ మరోసారి కెమెరా ముందుకు రాబోతున్నారు. దీంతో ఆయన అభిమానులకు శుభవార్త అందినట్లయింది. విజయ్ ఇప్పటివరకు హీరోగా 69 సినిమాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళగ వెట్రి కళగం () పార్టీని స్థాపించారు. విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్ అని గతంలో ప్రకటించడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ పథకాల ప్రచార చిత్రం
తమిళనాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రచార చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాల గురించి, ముఖ్యంగా పేద, బడుగు వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు, స్వయంగా ముఖ్యమంత్రి విజయ్ నటిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారట.











