ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జలంధర్‌లోని ఒలింపియన్ సుర్జీత్ సింగ్ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చైనాపై భారత్ 52తో ఘన విజయం సాధించింది.
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ ఆటగాడు సుఖ్జీత్ సింగ్ చెరో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జుగ్రాజ్ సింగ్ మరో గోల్ సాధించాడు. చైనా తరఫున యాంగ్ పెంగ్, చెన్ చోంగ్కాంగ్ ఒక్కో గోల్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సుఖ్జీత్ అద్భుత గోల్‌తో భారత్‌కు ఆధిక్యం
మ్యాచ్ ప్రారంభం నుంచే యువ చైనా జట్టుపై భారత్ ఒత్తిడి పెంచింది. తొలి క్వార్టర్లో 12వ నిమిషంలో సుఖ్జీత్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు 10 ఆధిక్యాన్ని అందించాడు. డిఫెన్స్ నుంచి వచ్చిన ఎత్తైన పాస్‌ను చక్కగా నియంత్రించి, ముందుకు వచ్చిన చైనా గోల్‌కీపర్‌పై నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు.












