దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో 600 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని అందుకున్న ఐదో దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. అదే మ్యాచ్‌లో తన 350వ టెస్టు వికెట్‌ను కూడా పూర్తి చేశాడు.
ఈ ఘనతతో రబాడ దక్షిణాఫ్రికా క్రికెట్లో దిగ్గజ బౌలర్ల సరసన చేరాడు. అతని కంటే ముందు ఈ మైలురాయిని అందుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు షాన్ పొలాక్ (823 వికెట్లు), డేల్ స్టెయిన్ (697 వికెట్లు), మఖాయా ఎన్టిని (661 వికెట్లు), అలన్ డొనాల్డ్ (602 వికెట్లు). రబాడ 260 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 601 వికెట్లు సాధించి ఈ జాబితాలో చోటు సంపాదించాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
350 టెస్టు వికెట్లు.. బంతుల పరంగా ప్రపంచ రికార్డు
ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను 14 పరుగుల వద్ద ఔట్ చేయడంతో రబాడ తన 350వ టెస్టు వికెట్‌ను పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అందుకోవడానికి అతను కేవలం 13,808 బంతులు మాత్రమే వేశాడు. దీంతో టెస్టు క్రికెట్లో 350 వికెట్లను అత్యంత తక్కువ బంతుల్లో సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.










