బోనకల్
ఖమ్మం: అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్‌లో తెలంగాణకు చెందిన యువ క్రీడాకారిణి తళ్లూరి నయనశ్రీ అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ () జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన తొలి భారత మహిళా షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్‌గా చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుతం ఇటలీలోని బోర్మియోలో జరుగుతున్న జూనియర్ ప్రపంచ కప్‌లో నయనశ్రీ అద్భుతంగా రాణించింది. మహిళల 500 మీటర్ల షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్‌ను కేవలం 47.144 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఈ ప్రదర్శనతో తన వ్యక్తిగత అత్యుత్తమ సమయాన్ని నమోదు చేయడంతో పాటు, భారత క్రీడా చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.












