మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్ కోసం జరిగిన మినీ వేలం విజయవంతంగా ముగిసింది. ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలు మొత్తం 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ అత్యధిక ధర రూ.1.10 కోట్లకు యూపీ వారియర్జ్ జట్టులో చేరారు.
కేరళలోని కొచ్చి వేదికగా న జరిగిన ఈ వేలంలో, సోఫీ మోలినెక్స్ తన కనీస ధర రూ.50 లక్షల నుంచి రూ.1.10 కోట్లకు చేరి అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచారు. భారత బ్యాటర్ కిరణ్ నవ్‌గిరేను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షలకు దక్కించుకుంది. ఈమె తన కనీస ధర రూ.40 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు
సోఫీ మోలినెక్స్ రూ.1.10 కోట్లు (యూపీ వారియర్జ్) కిరణ్ నవ్‌గిరే రూ.75 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్) జెస్ జోనాసెన్ రూ.40 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జి. కమలిని రూ.40 లక్షలు (గుజరాత్ జెయింట్స్) గ్రేస్ హారిస్ రూ.30 లక్షలు (యూపీ వారియర్జ్) స్నేహ్ రాణా రూ.30 లక్షలు (యూపీ వారియర్జ్) క్లో ట్రయాన్ రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఓర్లా ప్రెండర్‌గాస్ట్ రూ.30 లక్షలు (గుజరాత్ జెయింట్స్) తేజల్ హసబ్నిస్ రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)












