మణుగూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాటర్ సప్లై కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
మణుగూరు మున్సిపాలిటీలో గత ఎనిమిది సంవత్సరాలుగా 14 మంది వాటర్ సప్లై కార్మికులుగా పనిచేస్తున్నారని, వారికి నేటి వరకు పిఎఫ్, ఈఎస్ఐ లాంటి తదితర చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అమలు కాకపోవడం దారుణమని యూనియన్ నాయకులు తెలిపారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం సరైనది కాదని, ఇది వారి కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దసరా లోపు వేతనాలు చెల్లించాలి












