పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండుగలను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
పినపాక నియోజకవర్గ ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రకృతిని పూజిస్తూ, పూలను అందంగా పేర్చి బతుకమ్మను కొలిచే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు.












