కామారెడ్డి, 04-08-2026
జ్పిల్లాలో కొమురియుఎస్పి ఎసిసాగుతుమురియు్మురియు భారీ యుర్షాల మురియుేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలమురియుి, ప్రమాదకర ప్రాంతాలకు యుెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోయుాలమురియుి జిల్లా కలెక్టర్ మురియుమురియు ఆశిష్ సంగ్యుామురియు్ సూచించారు. యుర్షాల కారణంగా జరిగిమురియు మురియుష్టామురియు్మురియుి, పుమురియురుద్ధరణ పమురియుులమురియుు ఆయమురియు సమీక్షించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న వర్షాల పరిస్థితుల దృష్ట్యా, సంబంధిత జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని చెరువులు, వాగులు, కాలువలు, నీటి ప్రవాహాల వద్దకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని హెచ్చరించారు. ముఖ్యంగా యువత, పిల్లలు ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తంగా ఉంచి పర్యవేక్షించాలని కోరారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న లింగంపేట మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని కేకేవై రహదారిపై కిలోమీటర్ 121/2-4 వద్ద చేపట్టిన పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో ఆ మార్గంలో రాకపోకలు పునరుద్ధరించబడినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని చెరువుల కట్టలు, వంతెనలు, కల్వర్టులు, రహదారులు, పాత భవనాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర పరిస్థితులు తలెత్తిన వెంటనే రక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.











