రాష్ట్ర ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో విధులకు హాజరుకాని 51 మంది వైద్యులను శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ వైద్యులలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. కొందరు ఏడేళ్లుగా కూడా విధులకు హాజరు కాకపోవడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రభుత్వ వైద్యుల బాధ్యతారాహిత్యంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్న వైద్యులపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో, మొత్తం 51 మంది వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరైన వారు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ 51 మంది వైద్యులలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నట్లు సమాచారం. ఆరేళ్లు, ఏడేళ్లుగా కూడా ఆస్పత్రులకు రాని వైద్యులు ఉండటం అధికారులకు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.












