డిస్టిక్ బ్యూరో ఇంచార్జ్ కడప : రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి కె.జి. పద్మలత , 11 తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో బాలల హక్కుల చట్టాల అమలు, సంక్షేమ పథకాల తీరును పరిశీలించేందుకు ఆమె ఈ పర్యటన చేపట్టనున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి పి. రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
న కడపలోని అంగన్వాడీ కేంద్రం, సెంట్రల్ జైలు, మహిళా జైలు, దత్తత సంస్థ, కడప ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక ఆరోగ్య ఆసుపత్రి, ఏకీకృత సహాయ కేంద్రం, చిన్నపిల్లల వార్డులను కమిషన్ సభ్యురాలు సందర్శించి పరిశీలిస్తారు. అనంతరం ప్రభుత్వ బాలుర వసతి గృహం, మహిళా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేస్తారు.
న ఖాజీపేటలోని స్మార్ట్ కిచెన్, ఏపీ మోడల్ స్కూల్, మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం ప్రొద్దుటూరులో గ్రామీణ, పట్టణ ప్రాజెక్టులకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలతో బాలల రక్షణలో వారి పాత్రపై సమావేశమై ముఖాముఖి చర్చిస్తారు.
కమిషన్ సభ్యురాలి పర్యటనలో ఎలాంటి సమన్వయ లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను ఆదేశించింది. కేటాయించిన విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.