కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ చెరువులో గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సుమారు 700కు పైగా విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో, భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ చెరువులో గురువారం జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
టేక్రియాల్ చెరువులో 700కు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉన్నందున, భారీగా భక్తులు తరలివచ్చే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు పటిష్ఠంగా చేపట్టాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చెరువు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అనుమతి లేని వ్యక్తులు నీటిలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనానికి పెద్ద క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.












