ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మదన్ మోహన్ మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.42.80 కోట్ల వ్యయంతో 71.63 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
రామారెడ్డి మండల పరిధిలోని పోసానిపేట, రంగంపేట గ్రామాల సరిహద్దులో ఉన్న మోషంపూర్ చౌరస్తా వద్ద హైబ్రిడ్ యాన్యుటీ విధానం (హెచ్ఏఎం) మొదటి దశ కింద చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ రోడ్ల నిర్మాణానికి రూ.42.80 కోట్ల నిధులు కేటాయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం, రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.












