సంగారెడ్డి, 2026-08-05
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య కంది సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా జైలులోని బెయిరక్ గదులు, వంటగది, జైలు ఆవరణను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.

జైలులో ఉన్న ఖైదీలను కలిసి, వారికి అందుతున్న సదుపాయాలు, భోజనం నాణ్యత గురించి కార్యదర్శి సౌజన్య అడిగి తెలుసుకున్నారు. ఖైదీల బెయిరక్ గదులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని జైలర్ కు సూచించారు. ఖైదీలకు సమయానికి బెయిల్స్, ములాఖత్ లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
కేసుల పరిష్కారానికి ఉచిత న్యాయవాదిని నియమించే విషయాన్ని కూడా ఖైదీలకు తెలియపరిచారు. ఖైదీలకు అందిస్తున్న భోజనం రుచి చూసిన కార్యదర్శి, వారి కోసం నిల్వ ఉంచిన కూరగాయలు, బియ్యం ఉన్న గదిని కూడా పరిశీలించారు.